180కి పైగా సీట్లు గెలుస్తాం, విజయ్ ముఖ్యమంత్రి అవుతారు: టీవీకే పార్టీ

  • విజయ్ దూరదృష్టితో రాష్ట్రాన్ని పాలిస్తారన్న టీవీకే పార్టీ
  • ఎన్నికల అనంతరంపొత్తు వార్తలను కొట్టిపారేసిన టీవీకే పార్టీ
  • విజయ్ దూరదృష్టితో రాష్ట్రాన్ని పాలిస్తారని వ్యాఖ్య
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో, విజయ్ నేతృత్వంలోని తమ పార్టీ 234 స్థానాలకు గాను 180 నుంచి 200 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎగ్జిక్యూటివ్ చీఫ్ కోఆర్డినేటర్ కేఏ సెంగొట్టయాన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించదనే పరిస్థితి ఉండదని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థానాలు తాము తప్పకుండా గెలుస్తామని, విజయ్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

తమ నాయకుడు విజయ్ దూరదృష్టితో పాలన అందిస్తారని పేర్కొన్నారు. 2026 ఎన్నికల విజయం తమకు చారిత్రాత్మకమైనదని అన్నారు. విజయ్ రాత్రనగ, పగలనక కష్టపడ్డారని, ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారని, మే 4న వచ్చే ఫలితమే సమాధానం చెబుతుందని అన్నారు. ఎన్నికల అనంతరం పొత్తు వార్తలను ఆయన కొట్టిపారేశారు. తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని తెలిపారు.

కాగా, ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. అయితే విజయ్ ఈ ఫలితాల అనంతరం కింగ్ మేకర్‌గా నిలుస్తారని టుడేస్ చాణక్య, యాక్సిస్ మై ఇండియా అంచనా వేశాయి. అన్నాడీఎంకే నేృతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ నేపథ్యంలో, సెంగొట్టయన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Vijay
Tamil Nadu Assembly Elections
TVK Party
Tamilaga Vetri Kazhagam
KA Sengottaiyan
DMK

More Telugu News